Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది అసమ్మతిని రాజేస్తుంది
- పదో తరగతి వరకు హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడంపై విద్యార్థి సంఘాలు
కోహిమా : ఈశాన్య భారత్లో హిందీ భాష చిచ్చు కొనసాగుతున్నది. ఈ ప్రాంతంలోని రాష్ట్రాల్లో పదో తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరి చేయడంపై అక్కడి విద్యార్థి సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఈశాన్య విద్యార్థి సంఘాలు (ఎన్ఈఎస్ఓ) వ్యతిరేకించాయి. ఈ చర్య స్థానిక భాషలకు హానికరమని వివరించారు. అలాగే ఇది అసమానతను సృష్టిస్తుందని వాదించారు. ఈ మేరకు ఈ విషయంపై కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షాకు ఎన్ఈఎస్ఓ లేఖను రాసింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చింది. పదో తరగతి వరకు తమ ప్రాంతీయ భాషలను తప్పనిసరి చేయాలని సూచించింది. హిందీ ఐచ్చిక సబ్జెక్టుగా ఉండాలని పేర్కొన్నది. హిందీని తప్పనిసరి చేయడంపై అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని ఈనెల 7న న్యూఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటరీ అధికార భాష కమిటీ సమావేశంలో అమిత్ షా తెలిపిన విషయం విదితమే.