Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందీ భాషపై అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించినందుకు
న్యూఢిల్లీ : బీజేపీ పాలకులకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఎవరు ఏది మాట్లాడినా..వారిపై రాజద్రోహం కేసులు నమోదవుతున్నాయి. హిందీ భాషను జాతీయ అధికార భాష చేయాలంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టినందుకు, విమ ర్శించినందుకు మణిపూర్లో కాంగ్రెస్ నాయకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. మణిపూర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సనోయి శ్యామ్చరణ్ సింగ్ (సనోరు)పై ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజద్రోహం కేసులు నమోదుచేసింది. బీజేపీ యూత్ వింగ్ నాయకుడు భరీష్ శర్మ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఇంఫాల్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేసింది. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి..జ్యూడీషియల్ రిమాండ్ విధించాలని కోరింది. అయితే న్యాయస్థానం తిరస్కరించి, సనోరుకు బెయిల్ మంజూరుచేసింది. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సనోరు, అమిత్ షా వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిం చారు. పదో తరగతి వరకూ హిందీ భాషను తప్పనిసరి చేయాలన్న అమిత్ షా ఉద్దేశాన్ని సనోరు తప్పుబట్టారు. దీనిని వక్రీకరిస్తూ..మెజార్టీ హిందువుల మనోభావాల్ని సనోరు గాయపర్చారంటూ బీజేపీ నాయకుడు భరీష్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.