Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లు, విద్యుత్, బొగ్గు, మైనింగ్ ఆస్తులను అమ్మేసిన కేంద్రం
- నెరవేరిన ఎన్ఎంపీ లక్ష్యం
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ జాతీయ నగదీకరణ పైప్లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా భారీగా రోడ్లు, విద్యుత్, బొగ్గు, మైనింగ్ ఆస్తులను అమ్మేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఏకంగా రూ.96,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించినట్టు ఓ కేంద్ర ఉన్నతాధికారి వెల్లడించారు. రూ. 88,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకుమించిన ఆస్తులను ప్రభుత్వం విక్రయించిందన్నారు. ఎన్ఎంపీలో భాగంగా వచ్చే నాలుగేండ్లలో వివిధ రంగాలకు చెందిన రూ.6 లక్షల కోట్ల విలువ చేసే మౌలిక ఆస్తుల్ని కార్పొరేట్ శక్తులకు విక్రయించాలని బిజెపి ప్రభుత్వం గతేడాది లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రవాణా, రహదారుల శాఖ రూ. 23,000 కోట్ల ఆస్తుల్ని విక్రయించగా, విద్యుత్ శాఖకు చెందిన రూ.9,500 కోట్ల ఆస్తులను అమ్మేసింది. విక్రయ లక్ష్యాల్ని పూర్తిచేయని శాఖల్ని తదుపరి రోజుల్లో దీనిపై దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వం సూచించిందని ఆ అధికారి తెలిపారు.