Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్ కొట్టివేసిన సుప్రీం
న్యూఢిల్లీ : అన్ని మత సంస్థలు, ఛారిటీ సంస్థలకు ఒకే ఉమ్మడి సృతి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని, వక్ఫ్, వక్ఫ్ ఆస్థులను నియంత్రించే ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యారు దాఖలు చేసిన ఈ పిటీషన్‌ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఏకరీతి చట్టాన్ని రూపొందించాలని పార్లమెంట్‌కు కోర్టు ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. 1995 వక్ఫ్ చట్టం ద్వారా బాధించబడితే ఆ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటీషన్ వేయవచ్చనని తెలిపింది.