Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ నినాదాన్ని అపహాస్యం చేసేలా ప్రధాని వ్యాఖ్యలు
- గాంధీ, అంబేద్కర్ ఆందోళనలనూ తక్కువ చేసే యత్నం : రాజకీయ విశ్లేషకులు
ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వం..బలవంతంగా దేశంపై రుద్దాలనుకుంటోంది. భిన్న సంస్కృతి, సంప్రదాయాలతో కలిసి మెలిసి ఉన్న ప్రజల్లో విద్వేషపు చిచ్చుపెడుతోంది.మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హింసోన్మాదానికి తెగబడుతోంది. ఎన్నికలు వచ్చినా...రాకపోయినా వర్గవైషమ్యాలను సృష్టించటానికి వెనకాడటంలేదు. ప్రధాని మోడీ అంబేద్కర్ నినాదాన్ని అపహాస్యంచేసి,ఏడాదైనా.. ఇప్పటికీ జనం గుండెల్లో రగులుతూనే ఉన్నది.
న్యూఢిల్లీ : మోడీ రైతుల ఆందోళనలను ఉద్దేశించి ఆందోళన జీవీ లంటూ మోడీ ఎగతాళి చేసి నేటికి దాదాపు సంవత్సరం అయింది. అవి ఇపుడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నిరసన చేస్తున్నవారిని 'ఆందోళన జీవులు' అంటూ ఆయన గతేడాది పార్లమెంటులో ఈ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. గతేడాది అంబేద్కర్ జన్మదినోత్సవానికి రెండు నెలల ముందు అంటే ఫిబ్రవరి 8న పార్లమెంటులో ప్రధాని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సెషన్లో రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా రైతులపై మోడీ చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో అగ్గిని రాజేశాయి. అయితే, ప్రధాని చేసిన వ్యాఖ్యలు రైతులు, నిరసనకారులకు మాత్రమే పరిమితం కాలేదని రాజకీయ విశ్లేషకులు వివరించారు. ఇవి మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి మహనీయులు దేశం బానిస సంకెళ్లు విడిపించడానికి చేసిన ఆందోళనలనూ అపహాస్యం చేసేలా ఉన్నాయని గుర్తు చేశారు.
'బోధించు.. సమీకరించు..పోరాడు'. ఇది యావత్భారతావనికి భారతరత్న అంబేద్కర్ ఇచ్చిన పిలుపు. ఈ ఒక్క నినాదం దేశ ప్రజల్లో, యువతలో మంచి స్పూర్తిని నింపింది. ఇటు భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు వరుసలో ఉండి బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాడారు. అనేక ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలను నిర్వహించారు. ప్రజలను అందులో భాగస్వామ్యం చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు, అసమానత, అన్యాయాలకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలతో ప్రజలలో స్ఫూర్తిని నింపారు గాంధీ, అంబేద్కర్. వారు తాము అనుకున్న లక్ష్యాలను, హక్కులను, కోరికలను సాధించుకోగలిగారు. భారత ఉద్యమ నాయకులుగా పేరుగాంచి కోట్లాది మంది జ్రల్లో స్ఫూర్తిని నింపిన గాంధీ, అంబేద్కర్లు.. ఆందోళనకు చోటు లేని ప్రజాస్వామ్యం బలహీనమైనదని అభివర్ణించారు. అయితే, మోడీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'ఆందోళన జీవి' అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు దేశంలోని రైతులను మాత్రమే కాకుండా గాంధీ, అంబేద్కర్ వంటి మహానాయకులు, వారి లక్ష్యాలు, నినాదాలను ఎగతాళి చేసే విధంగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు తెలిపారు. జీన్డ్రీజ్, అమర్త్యసేన్ వంటి మేథావులు, ప్రొఫెసర్లు మోడీ వ్యాఖ్యలని ఆనాడే తప్పుబట్టారు. రైతు నిరసనకారులను అపహాస్యపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నించిన మోడీ.. అంబేద్కర్ నినాదాన్ని ఎగతాళి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీ, అంబేద్కర్ వంటి మహనీయులు చూపిన ఆచరణాత్మక బాటలు మోడీ సర్కారు హయాంలో కనిపించటం లేదని 'ఇండియన్ సమ్మర్ : ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ఎంపైర్'' రచయిత అలెక్స్ వోన్ టుంజెల్మన్న్ అన్నారు. కొత్త భారత్లో ఆందోళనకు చోటు కనిపించడం లేదని వివరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అంబేద్కర్, గాంధీ వంటి మహనీయులు చూపిన ఆదర్శాలు అంటే గౌరవం లేదనీ రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇందుకు ప్రస్తుత మోడీ పాలనే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మోడీ పాలనలో దళితులు, రైతులు, మహిళలు, విద్యార్థులకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో ఆందోళన చేయటం సర్వసా ధారణమనీ, ప్రస్తుతం భారతదేశంలో ఆ పరిస్థితులు కనపడటం లేదన్నారు.