Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్స్ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ : దేశంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ దడపుట్టిస్తోంది. నోయిడా, ఢిల్లీ, ముంబయిలో ఈ వైరస్ సోకిన కేసులు పెరుగుతున్నాయి. దీంతో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఢిల్లీలోని ఓ ప్రయివేటు పాఠశాలలో గురువారం ఉదయం నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఒక విద్యార్థి, ఉపాధ్యాయురాలికి పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం మిగతా విద్యార్థులను స్కూల్ నుండి ఇంటికి పంపించారు. ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 299 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 నుంచి 2.70కు పెరిగింది. తాజాగా కేసులతో కలిపి ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,66,881కి పెరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అతిషి మాట్లాడుతూ.. విద్యార్థి, టీచర్‌కు పాజిటివ్ అని తేలడంతో మిగతా విద్యార్థులను ఇంటికి పంపినట్టు తెలిపారు. రెండేండ్ల తర్వాత ఆఫ్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయని అన్నారు. కానీ, పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మళ్లీ ఆందోళన నెలకొందన్నారు. నొయిడా, ఘజియాబాద్‌లోని పాఠశాలల్లోనూ కరోనా కేసులు వెలుగుచూసినసంగతి తెలిసిందే. నోయిడాలోని నాలుగు పాఠశాల్లో 23 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. ఘజియాబాద్‌లోని ఒక ప్రయివేట్ పాఠశాలలో గత వారం ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేశారు.