Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటకలో కాంట్రాక్ట్ ఆత్మహత్య కారణమైన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి కెఎస్ ఈశ్వరప్పను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ నేతలు గురువారం ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బమ్మై నివాసానికి ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సూర్జేవాలా, డికె శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పోలీసులు అడ్డుకుని.. అరెస్టు చేశారు. ఈశ్వరప్ప కమీషన్ ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంటూ సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ మంగళవారం ఉడిపిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. ఆత్మహత్య చేసుకునే ముందు.. తన చావుకు ఈశ్వరప్పే కారణమంటూ ఓ వాట్సాప్ వీడియోను స్నేహితులకు షేర్ చేశారు. ఈ మృతిపై సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన్ను ఇప్పటి వరకు మంత్రి పదవి నుంచి తొలగించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు గురువారం ఆందోళనలు చేపట్టాయి.