Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో మత స్వేచ్ఛ లేదన్న బ్లింకెన్
- అమెరికాలో మానవ హక్కులు కరువన్న జైశంకర్
న్యూఢిల్లీ : భారత్‌లో మత స్వేచ్ఛ గురించి అమెరికా లేవనెత్తితే, ఆ దేశంలో మానవ హక్కుల గురించి తాము కూడా మాట్లాడాల్సి ఉంటుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. మత స్వేచ్ఛ విషయంలో భారత్‌ను ప్రమాదకర దేశాల జాబితాలో చేర్చుతామని బ్లింకెన్ సోమవారం చేసిన వ్యాఖలు దుమారం రేపాయి. దీనికి జైశంకర్ స్పందిస్తూ, భారతీయ సంతతికి చెందిన అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, ఇటీవల న్యూయార్క్‌లో సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తిపై జరిగిన గురించి ప్రస్తావించారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యుఎస్సిఐఆర్ఎఫ్) ఈ నెల 25న తన నివేదికను ఆ దేశ విదేశాంగ శాఖకు సమర్పించనుంది. భారత్‌లో మతపరమైన మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఒక వైపు లాబీయింగ్ నెరపుతూ, మరో వైపు బ్లింకెన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే యత్నం చేస్తోంది. ఆ నివేదికలో ప్రధాని మోడీ పేరు ప్రస్తావించకుండా చూడాలని అమెరికాలోని భారత్ లాబీయిస్టులు ప్రయత్నిస్తున్నారు.
మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మాట్లాడుతూ, భారత్‌లో మానవ హక్కుల పరిస్థితులపై ఆరోపణలు చేశారు. ఆ పత్రికా సమావేశంలో మన రక్షణ, విదేశాంగ మంత్రులు వున్నప్పటికీ ఏ ఒక్కరూ వాటిని ఖండించలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ నేపథ్యంలో జైశంకర్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బ్లింకెన్ వ్యాఖ్యలను ఖండించారరు. 2ప్లస్2 సమావేశంలో మానవ హక్కుల విషయం చర్చకు రాలేదని చెప్పారు. భారత్ గురించి వారికి అభిప్రాయాలు వుండొచ్చు కానీ, అమెరికాతో సహా ఇతరుల మానవ హక్కుల పరిస్థితులపై మాక్కూడా అభిప్రాయా లుంటాయని తెలుసుకోవాలన్నారు.