Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 95 శాతం మంది వ్యతిరేకత
- పార్లమెంటరీ ప్యానెల్‌కు ఈ-మెయిల్ రిప్రజెంటేషన్లు
న్యూఢిల్లీ : దేశంలో మహిళల వివాహ వయసును పెంచుతూ కేంద్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మహిళల వివాహ వయసును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచుతూ గతేడాది కేంద్ర క్యాబినేట్ నిర్ణయం
తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ దాదాపు 95 శాతం ఈమెయిల్ రిప్రజెంటేషన్లు.. బిల్లును పరిశీలిస్తున్నటువంటి పార్లమెంటరీ ప్యానెల్‌కు అందాయి. అయితే, దీనిని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు ఒక కుట్రగా అభివర్ణిస్తున్నాయి. మైలురాయిగా ఉన్న ప్రభుత్వ చొరవను ఓడించే కుట్రలో ఇది భాగమని కమిటీలోని వర్గాలు ఆందోళను వ్యక్తం చేశాయి. విద్య, మహిళ, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి బీజేపీ ఎంపీ వినరు సహస్రబుద్ది నేతృత్వం వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన బాల్య వివాహల (సవరణ) నిరోధక బిల్లుపై ఈ కమిటీకి దాదాపు 95వేల ఈ-మెయిల్ రిప్రజెంటేషన్లు అందాయి. ఇందులో 90వేల ఈ-మెయిళ్లు బిల్లును వ్యతిరేకించాయని తెలిసింది.