Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద కంపెనీలకు తగ్గిన ఆదాయాలు
న్యూఢిల్లీ : ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం పలు భారత కంపెనీలపై ప్రతికూలతను చూపుతోంది. శ్రీలంకలో ద్రవ్యోల్బణం అమాంతం ఎగిసి రెండంకెల స్థాయికి చేరడంతో అక్కడ వ్యాపార కార్యకలాపాలు కలిగిన డామినోస్ పిజ్జా, కెఎఫ్సి, పిజ్జా హట్లు నిర్వహించే సంస్థలు తమ వ్యాపారాలు దెబ్బతిన్నట్టు పేర్కొంటున్నాయి. అధిక ధరలు అనేక కంపెనీలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రీలంకలో పెట్రోలియం, రిటైల్, ఐటి, ఫైనాన్సియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, టెలి కమ్యూనికేషన్, హౌటళ్లు, పర్యాటకం, బ్యాంకింగ్, సిమెంట్, గ్లాస్, ఇన్ఫ్రా డెవలప్మెంట్ తదితర పలు రంగాల్లో భారతీయ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ ద్వీప దేశంలో కెఎఫ్సి, ఫిజ్జా హట్ లాంటి క్విక్ సర్వీసు రెస్టారెంట్టను సఫైర్ ఫుడ్స్ నిర్వహిస్తుంది. ఈ సంస్థ భారత్, శ్రీలంక, మల్దీవుల్లో 400 పైగా కెెఎఫ్సి, ఫిజ్జాహట్, టకో బెల్ రెస్టిరెంట్లు కలిగి ఉంది. భారతీయ కరెన్సీతో పోలిస్తే శ్రీలంకన్ రూపాయి (ఎల్కెఆర్) విలువ భారీగా క్షీణించింది. దీంతో తమ ఆదాయాలు భారీగా పడిపోతున్నాయని ఆయా కంపెనీ వర్గాలు వాపోతున్నాయి. భారత్, శ్రీలంక, నేపాల్లో డొమినోస్ ఫిజ్జా ఫ్రాంచైజీలను నిర్వహిస్తున్న రివాల్ జుబ్లియంట్ ఫుడ్ వర్క్స్ ఆదాయాలు కూడా పడిపోయాయి.
బడా కంపెనీలయినటువంటి డాబర్, ఏసియన్ పేయింట్స్, తాజ్ హౌటల్స్, ఇండియన్ ఆయిల్, ఎయిర్ టెల్, అశోక్ లేలాండ్, టాటా కమ్యూనికేషన్స్ వర్క్ తదితర వాటి వ్యాపారాలు కూడా ప్రభావితమయ్యాయి. శ్రీలంక కరెన్సీ విలువ పడిపోవడంతో భారత కంపెనీల ప్రగతిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని.. ఆ దేశంలో ప్రత్యక్షంగా వ్యాపారాలు కలిగిన అనేక కంపెనీలు ఆదాయ, లాభాల పరంగా ఒత్తిడికి గురైయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.