Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ ప్రజలకు శుభవార్త ...
చండీగఢ్ : పంజాబ్‌కు ఆప్ సర్కార్ పవర్ న్యూస్ ప్రకటించింది. పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువుదీరి నేటికి సరిగ్గా నెల రోజులయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆప్ సర్కారు శుభవార్త వినిపించింది. జులై 1 నుంచి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 92 చోట్ల విజయం సాధించింది. పంజాబ్‌లో అధికారంలోకి వస్తే ఢిల్లీలో ఇస్తున్నట్టు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఏప్రిల్ 16న రాష్ట్ర ప్రజలు మంచి వార్త వినబోతున్నారంటూ ఇటీవల ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ముందుగానే ప్రకటించారు. అన్నట్లుగానే ఉచిత విద్యుత్‌పై నేడు ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో మాన్ ఇటీవల సమావేశమై దీనిపై చర్చించి నిర్ణయించారు.