Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్వేషపూరిత నిర్ణయాలపై ప్రధాని సంతకం చేస్తారు..కాబట్టి : కునాల్ మర్చంట్
న్యూఢిల్లీ : దేశంలో విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తున్న మోడీ సర్కార్‌కు ప్రముఖ ఫర్నిచర్ డిజైనర్ కునాల్ ఇచ్చిన షాక్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిం చింది. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఓ మెయిల్‌కు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్‌మీడియాలో చర్చనీయాంశ మైంది. ప్రధాని కార్యాలయంలో భారీ స్థాయిలో ఒక టేబుల్ తయారు చేయాలంటూ ప్రధాని అధికారిక కార్యాలయమైన పీఎంఓ నుంచి కునాల్ మర్చంట్ సంస్థకు మెయిల్ ద్వారా ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్‌ను ఆయన తిరస్కరిస్తూ..కునాల్ ఇలా రాశాడు, ''ముఖ్యమైన పని కోసం నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. కానీ నా రాజకీయ మరియు సామాజిక అభిప్రాయాల కారణంగా, నేను ఈ ఆఫర్‌ను తిరస్కరించాను. నేను గాంధేయవాదిని, అహింసను నమ్ముతాను. మైనారిటీలకు వ్యతిరేకంగా నిర్ణయాలపై సంతకం చేయడానికి , వారిని దూరం చేయడానికి నేను టేబుల్‌ను తయారుచేసి ఇవ్వలేను. మోడీ ప్రభుత్వం ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోంది. మీ రాజకీయాలు మీలో ద్వేషంతో నిండిపోయాయని చూపిస్తున్నాయి. నేను మీ ఆఫీసు కోసం టేబుల్‌ను తయారు చేస్తే, అది మైనారిటీ, దళిత , ఎల్జిబిటిక్యూ నేపథ్యాల నుంచి వచ్చిన నా స్నేహితులు, కుటుంబ సభ్యులు , సిబ్బందిని మోసం చేసినట్లే. నేను అది చెయ్యలేను''.
అది నకిలీ మెయిల్ : ఢిల్లీ పోలీసులు
పీఎంఓ నుంచి కునాల్‌కు వచ్చిన మెయిల్ నకిలీదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పీఎంఓ ఉద్యోగి ఒకరు నకిలీ గుర్తింపుతో మెయిల్ పంపారని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసు కమిషనర్ తెలిపారు.