Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభావం
- అవసరమైన వస్తువుల డిమాండ్ తగ్గే అవకాశం : విశ్లేషకులు
న్యూఢిల్లీ : ఇంధన నుంచి నిత్యవసరాల వరకు.. పెరుగుతున్న ధరలు దేశంలోని ప్రజలకు షాకిస్తున్నాయి. ముఖ్యంగా, దీని ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై పడుతున్నది. అయితే, ఈ ప్రభావం కారణంగా అవసరమైన వస్తువుల డిమాండ్ తగ్గే అవకాశం ఉన్నదని నిపుణులు, విశ్లేషకులు వివరించారు. '' పేద ప్రజలు తాము సంపాదించిన దానిలో ఎక్కువ భాగం ఆహారం కోసం ఖర్చు చేస్తారు. అయితే ఆహార ధరలలో తీవ్రమైన పెరుగుదల పేదలను ఎక్కువగా దెబ్బతీసే ప్రమాదమున్నది'' అని వారు చెప్పారు. '' గ్రామీణ ప్రాంతంలోని పేదలు 20 శాతం మంది, 60 శాతం మధ్యస్థ ఆదాయ ప్రజలు 7.7 శాతం వద్ద అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్నారని మా అంచనా. పట్టణ ప్రాంతాల్లో పేదలు 20 శాతం మంది ఇతర ఆదాయ విభాగాల కంటే అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్నారు'' అని క్రిసిల్ పేర్కొన్నది. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ట స్థాయికి అంటే 6.95 శాతానికి చేరుకున్నది. ఇది ఆహారం, ఇంధన ధరల పెరుగుదలకు దారి తీసింది. అధిక ఇంధన ధరలతో కుటుంబ పొదుపును కోల్పోతున్నామని న్యూఢిల్లీకి చెందిన జొమాటో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యుటీవ్ ఉపేంద్ర తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది ప్రారంభం నుంచి ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. ఇంతకముందు రోజుకు రూ. 100-150 మధ్య ఇంధనం ఖర్చు అయ్యేదనీ, అది ఇప్పుడు రూ. 200-250 కు పెరిగిందన్నారు. వినియోగదారుల కష్టాల సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ పరిశ్రమలోని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.