Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలక్కడ్ ఘటనలపై కేరళ సిఎం
తిరువనంతపురం: శాంతి సామరస్యానికి విఘాతం కలిగించే శక్తులను ఎంతమాత్రమూ ఉపేక్షించేది లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. పాలక్కడ్‌లో జరిగిన పిఎఫ్ఐ, ఆరెస్సెస్ నాయకుల హత్యలపై ఆయన స్పందిస్తూ, కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించి, అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న తరుణంలో శాంతికి విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు యత్నిస్తున్నాయి. ఈ నీచమైన చర్యలకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. సౌభ్రాతత్వాన్ని, శాంతిని ధ్వంసం చేయాలని చూస్తున్న శక్తులను ప్రజలే తిప్పికొడతారన్నారు. స్నేహం , సౌభ్రాతృత్వం, మానవత్వం ఇదే కేరళ సంస్కృతి, దీనిని భద్రంగా కాపాడుకుందామని పినరయి విజయన్ అన్నారు. మతతత్వం, సంకుచితతత్వం అనే విషాన్ని చిమ్ముతూ దేశాన్ని అల్లకల్లోలం సృష్టిస్తున్న శక్తులను ఒంటరిపాటు చేయాలని ఆయన కోరారు.