Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెమా నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ : ఎల్ఐసీ ప్రయివేటీకరణ చేయడమేగాక.. అందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ మోడీ సర్కార్ తెరలేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థగా పేరు ప్రఖ్యాతలున్న ఎల్ఐసీలో కేంద్రం తన వాటాను అమ్ముతున్న విషయం తెలిసిందే. ఈమేరకు త్వరలో స్టాక్మార్కెట్లోకి ఎల్ఐసీ ఐపీవో రానున్నది. దాంతోపాటు ఎల్ఐసీలో 20శాతం ఎఫ్డీఐలకు అవకాశం కల్పిస్తూ మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 'ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మేంట్ యాక్ట్' (ఫెమా)లో మార్పులు చేసింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎల్ఐసీ ఐపీవో ద్వారా దాదాపు రూ.63వేల కోట్లు సేకరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఐపీవో ముసాయిదా దరఖాస్తుకు సెబీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి ఇచ్చింది. ఐపీవో ముసాయిదా దరఖాస్తులో కొన్ని మార్పులు చేయటంతో ఆర్బీఐ అనుమతి మరోమారు అవసరమైంది. ఐపీవోకు వెళ్లే ముందు ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో 20శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఇస్తూ కేంద్ర మంత్రివర్గం మార్చి 14న ఆమోదముద్ర వేసింది. తద్వారా పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు అవకాశం కల్పిస్తూ ఫెమా నిబంధనల్లో మార్పులు చేసినట్టు..నోటిఫికేషన్లో పేర్కొన్నారు.