Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధానసభ ఎదుట నిరసన
భువనేశ్వర్ : ఒడిస్సాలో ట్యాక్సీ, ఆటో, లారీ, బస్సు డ్రైవర్ల ఆందోళనలు మిన్నంటాయి. అన్ని జిల్లాల నుంచి వేలాది మంది డ్రైవర్లు రాజధానికి చేరుకున్నారు. తమ 11 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని భువనేశ్వర్ విధానసభ ఎదుట నిరసన చేపట్టారు. గత కొన్నేండ్లుగా ఉన్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిరసనకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రమాదంలో డ్రైవర్ మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.20లక్షలు, గాయపడితే రూ.5లక్షల పరిహారం, 55 ఏళ్లు నిండిన ప్రతి డ్రైవర్‌కు పింఛన్, రహదారులపై 30 కిలోమీటర్ల వ్యవధిలో మరుగుదొడ్ల ఏర్పాటు, డ్రైవర్లపై పోలీసుల చర్యల నియంత్రణ డిమాండ్లు నెరవేర్చాలని నిరసన తెలుపుతున్నారు.