Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమత్ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన మత ఘర్షణలకు సంబంధించి.. ఇరు వర్గాలకు చెందిన 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు, సామాన్యులు సైతం గాయపడిన సంగతి విదితమే. ఈ ఘర్షణలకు కారణమైన ఇరు మతస్తులకు చెందిన 23 మందిని అరెస్టు చేయగా.. వారిలో ఎనిమిది మందికి క్రిమినల్ రికార్డులున్నాయని పోలీసులు సోమవారం తెలిపారు. ఏ వ్యక్తి అయినా దోషిగా తేలితే.. మతం, కమ్యూనిటీ, తరగతి అనే సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందనీ, దీని నిమిత్తం 14 బృందాలకు ఏర్పాటుచేశామని తెలిపారు. నాలుగు ఫోరెన్సిక్ బృందాలు.. ఘటనాస్థలిని ఈ రోజు సందర్శించి, శాంపిల్స్ సేకరించినట్టు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్, డిజిట్ మీడియాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కొంత మంది సోషల్ మీడియా ద్వారా శాంతి విఘాతం కల్పించాలని ప్రయత్నిస్తున్నారని, సోషల్‌మీడియాను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిని గుర్తించి.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.