Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలుగు అకాడమీ విభజన కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారించింది. సిఎస్ సోమేశ్ కుమార్ తన తల్లి మృతి అనంతరం సోమవారమే విధులకు హాజరయ్యారనీ, కోర్టు సూచనల మేరకు కమిటీ నియామకంపై ప్రభుత్వ ఆదేశాలు తీసుకోవడానికి మరింత సమయం కావాలని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ ధర్మాసనాన్ని కోరారు. తాము ఇప్పటికే పేర్లను సూచించామని ఆంధ్రప్రదేశ్ తరపు సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాధన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రతిపాదన వచ్చిన తర్వాత రెండింటినీ కోర్టుకు అందజేయాలని సూచించిన ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 29కు వాయిదా వేసింది. తెలుగు అకాడమీతోపాటు విభజన చట్టంలోని పదో షెడ్యూలులో సంస్థల విభజనకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమి స్తామని ధర్మాసనం గత విచారణలో పేర్కొన్న విషయం విదితమే.