Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంను ఆశ్రయించిన ముస్లిం సంస్థ
న్యూఢిల్లీ : హింసాత్మక ఘటనలు జరిగిన సమయంలో క్రిమినల్ ప్రొసిడింగ్స్‌లో భాగంగా అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేయడం వంటి ప్రతికూల చర్యలకు వ్యతిరేకంగా ముస్లిం సంస్థ జమాయత్ ఉలామా-ఇ-హింద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రతికూల చర్యలను నిలిపివేయాలని యుపి, మధ్యప్రదేశ్‌తో సహా కేంద్రానికి ఆదేశాలివ్వాలని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ఇటీవల రామనవమి వేడుకల్లో జరిగిన మత ఘర్షణలు జరగ్గా.. కొంత మంది అనుమానితులుగా భావిస్తూ వారి ఇళ్లను బుల్డోజర్లతో పడగొట్టిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. క్రిమినల్ ప్రొసిడింగ్స్ కింద ఇళ్లను ధ్వంసం చేయడం వంటివి క్రిమినల్ చట్టానికి తెలియదని పేర్కొంది. 'శిక్షాపరమైన చర్యల్లో భాగంగా నివాస గహాలు, వాణిజ్య ఆస్తులను కూల్చివేయడం సాధ్యం కాదని పిటిషనర్లు కూడా డిక్లరేషన్ కోరుతున్నారు. మతపరమైన అల్లర్లు, జనాభా అస్తవ్యస్తంగా మారే పరిస్థితులను పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించాలని కోరుతున్నాం' అని పిటిషన్లో పేర్కొంది.