Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీర్‌కు తొలిసారి సైన్యం బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత సైన్యం సారథిగా లెఫ్టినెంట్ జనరల్‌గా మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ చర్చలు జరిపి.. పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌గా జనరల్ నరవాణే ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ పాండేను ఆయన వారసుడిగా కేంద్రం ఖరారు చేసింది. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఆర్మీ చీఫ్ కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం. ఆర్మీ చీఫ్ కోసం పాండేతోపాటు జై సింగ్ నయన్, అమర్దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లను కేంద్రం పరిశీలించింది. వీరిలో అత్యంత సీనియర్ అయిన పాండేకే బాధ్యతలను అప్పగించింది.