Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరిని దేశానికి అంకితం చేయండి
- హిందువులకు సాధ్వి రితంబర పిలుపు
న్యూఢిల్లీ : హిందు జంటలు నలుగురు పిల్లలను కనాలని హిందూత్వ నాయకురాలు సాధ్వి రితంబర అన్నారు. వారిలో ఇద్దరిని దేశం కోసం అంకితం చేయాలని కోరారు. భారత్ త్వరలోనే హిందూ దేశమవుతుందని చెప్పారు. దేశం సాగిస్తున్న ప్రగతి పట్ల వారికి ఈర్ష్య ఉన్నదని ఢిల్లీలో హనుమాన్ జయంతి శోభా యాత్రపై దాడి చేసినవారి గురించి మాట్లాడుతూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ తీవ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నవారు మట్టికరుస్తారన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ను భారత్లో అమలు జేయాలనీ, అలా అయితే, జనాభా అసమానత ఉండదన్నారు. జనాభా అసమానత దేశానికి ఏ మాత్రమూ మంచిది కాదన్నారు. సాధ్వి రితంబర చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.