Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్కు ప్రైవేటీకరణ వేగవంతం
న్యూఢిల్లీ : విశాఖ ఉక్కును ప్రైవేవేటీకరించే దిశలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరింత దూకుడు పెంచింది. ఒకేసారి కాకుండా ముక్కలు చేసి అమ్మాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ప్లాంటుకు చెందిన ఖాళీ భూములను విక్రయ ప్రక్రియ నుండి మినహాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రముఖ ఆర్థిక పత్రిక ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురిం చింది. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా మరింత ఎక్కువ ధరను రాబట్టుకోవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. తాజా సమా చారం ప్రకారం విశాఖ ఉక్కు యాజమాన్య సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను కార్పొరేట్లకు విక్రయించే ముందు ఆ సంస్థ ఆధీనంలోని దాదాపు 9 వేల ఎకరాల భూమిని వేరు చేసే అవకాశం ఉంది. దీంతో పాంటు ప్లాంటులోని అన్ని యూనిట్లను ఒకే సారి కాకుండా దశల వారీగా తెగనమ్మవచ్చని చెబుతున్నారు ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం అధీనంలో 19,730 ఎకరాలు వున్నాయి. ప్లాంట్ దాదాపు 11 వేల ఎకరాల్లో వుంది. ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. దీన్ని ఏడాదికి 11మిలియన్ టన్నులకు పెంచగల సత్తా వుంది. సామర్ధ్యాన్ని ముఖ్యంగా దీర్ఘకాలిక ఉత్పత్తులకు సంబంధించిన సామర్ధ్యాన్ని విస్తరించుకోవాలనుకునే ఉక్కు కర్మాగారాలకు ఓడరేవు ఆధారిత యూనిట్ వుంటే పరిస్థితి మరింత మెరుగ్గా, ఆకర్షణీయంగా వుంటుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.