Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చికిత్స కోసం విదేశాల నుంచి వచ్చేవారికి ఆయుష్ వీసాలు : ప్రధాని
న్యూఢిల్లీ: భారతదేశంలో సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ఆరంభమైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బుధవారం అహ్మదాబాద్లో 'ఆయుష్ ఇన్వెస్ట్మేంట్, ఇన్నోవేషన్' సదస్సును ప్రారంభించారు. ఆయుష్ ఉత్పత్తుల్లో నాణ్యత తీసుకొచ్చేందుకు..సంప్రదాయ ఔషధాలకు గుర్తింపు ఇచ్చే వ్యవస్థను తీసుకొస్తామన్నారు. దేశంలో అల్లోపతి వైద్య విధానానికి ప్రత్యామ్నాయంగా పేర్కొనే ఆయుర్వేద, యోగా, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి సంప్రదాయ వైద్య చికిత్సల్ని కేంద్రంలో మోడీ సర్కార్ 'ఆయుష్'గా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చింది. ఇందుకోసం కేంద్రంలో ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖను సైతం ఏర్పాటుచేసింది. సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్, మారిషస్ ప్రధాని ప్రవింద్కుమార్ జగన్నాథ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రధాని మాట్లాడుతూ... ఆయుష్ ఔషధ ఉత్పత్తులకు గుర్తింపు తీసుకువచ్చే వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. తద్వారా కొనుగోలుదారుల్లో ఆయుష్ ఉత్పత్తుల పట్ల నమ్మకం పెరుగుతుందన్నారు.