Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణాలు మరింత భారం
న్యూఢిల్లీ: దేశంలో సిమెంట్ ధరలు 6-13 శాతం పెరుగొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రష్యా, ఉక్రెయిన్ పరిణామాలతో బొగ్గు, పెట్ కోక్, ముడి చమురు దిగుమతులు భారం కావడంతో సిమెంట్ తయారీ వ్యయం పెరిగినట్లు పేర్కొంది. గడిచిన ఆరు మాసాల్లో బొగ్గు ధరలు 30-50 శాతం పెరిగాయని క్రిసిల్ తెలిపింది. గడిచిన 12 మాసాల్లో దేశ వ్యాప్తంగా సిమెంట్ బ్యాగ్ ధర రూ.390కి చేరింది. పెరిగిన ముడి సరుకుల ధరలను వినియోగదారులపై మోపడానికి తయారీ సంస్థలు సిద్దం అవుతున్నాయని క్రిసిల్ పేర్కొంది.