Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్‌కు 3.60 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు ఎరువుల శాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్ చతుర్వేది తెలిపారు. ఎరువుల రవాణా ఒప్పందాన్ని రష్యా గౌరవంగా భావిస్తోందని అన్నారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎరువుల కొరతకు దారితీసేకాశం ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో 354.34 ఎల్ఎంటీ ఎరువులు అవసరం కాగా, దేశంలో మొత్తం 485.59 ఎల్ఎంటీల నిల్వలు ఉన్నాయనీ, ఎరువుల కొరత సమస్య ఎదురయ్యే అవకాశమే లేదని అన్నారు. వ్యవసాయంపై జాతీయ కాన్ఫెరెన్స్‌లో 'ఖరీఫ్ క్యాంపెయిన్ -2022' ను ఉద్దేశించి చతుర్వేది మాట్లాడుతూ.. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లోనూ రష్యా నుంచి ఎరువుల సరఫరా కొనసాగుతోందని అన్నారు. యుద్ధంతో బెలారస్ నుంచి పొటాష్ సరఫరాకి ఆటంకం ఎదురైనప్పటికీ కెనడా నుంచి 12 ఎల్ఎంటీ పొటాష్‌ను దిగుమతి చేసుకుందని చతుర్వేది చెప్పారు. ఇజ్రాయిల్, జోర్డాన్‌ల నుంచి అదనంగా 8.75 ఎల్ఎంటీ పొటాష్‌ను దిగుమతి చేసుకోనున్నామని అన్నారు.