Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: బెయిల్ మంజూరు, తిరస్కరణకు దారితీసిన కారణాలను న్యాయమూర్తులు నిర్ధిష్టంగా పేర్కొనాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేకించి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ, కరుడుగట్టిన నేరస్తుల భాగస్వామ్యం ఉన్న కేసుల్లోనూ ఇది తప్పనిసరి అని పేర్కొంది. నిర్ధిష్ట కారణాలు చూపకుండా జారీ చేసే నిగూఢమైన బెయిల్ ఉత్తర్వులకు న్యాయవ్యవస్థలో స్థానం లేదని ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. 'వాస్తవాలు, పరిస్థితులను పరిగణలోకి తీసుకొన్న తర్వాత' అనే సాధారణ పరిశీలనను పేర్కొంటూ బెయిల్ మంజూరు చేస్తూ, లేదా తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసే ధోరణి ఇటీవల పెరిగిపోతోందని ఒక కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం మంగళవారం నాడు ఆందోళన వ్యక్తం చేసింది.
మైనర్ అయిన తన మేనకోడలిపై కొన్నేండ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక దుండగునికి రాజస్థాన్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కరుడుగట్టిన నేరస్తుడిగా ముద్రపడిన సదరు నిందితునిపై 20 క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను జస్టిస్ ఎన్వి రమణ నేతత్వంలోని ధర్మాసనం కొట్టిపారేసింది. నిందితుడు వారంలోగా లంగిపోవాలని ఆదేశించింది.
'ఈ తీర్పు రాసిందెవ్వరు?' అంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన ధర్మాసనం..'న్యాయమూర్తులు ఒక నిర్ణయానికి రావ డానికి దారితీసిన కారణాలను తెలియజేయడం వత్తిధర్మం. హేతుబద్ధత న్యాయ వ్యవస్థకు జీవగర్ర. ప్రతి ఉత్తర్వూ హేతుబద్ధంగా ఉండాలి' అని ధర్మాసనం పేర్కొంది. అంతేకాని యాంత్రికంగా బెయిల్ఉత్తర్వులు ఇవ్వరాదని స్పష్టం చేసింది.