Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్‌లో గుర్రంపై వరుడి ఊరేగింపు
భోపాల్: ప్రజలంతా ఒకే వ్యక్తి ఒకే విలువ అనే రాజ్యాంగ సూత్రం అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా దేశంలోని సామాజిక అసమా నతలు తగ్గడం లేదు. సమాజికంగా వెనుకబడిన వారు ఇప్పటికీ ప్రత్యక్షం గానో పరోక్షంగానో అనేక రకాల వివక్షలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగాలు, ఇతర అభివృద్ధికరమైన అంశాల్లో వారికి ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక ఆచార సంప్రదాయాల విషయంలో కూడా వారికి ఈ ఇబ్బందులు తప్పడం లేదు. గుడిలోకి వచ్చారనే కాదు గుర్రం ఎక్కారనో, మీసం పెంచారనో దాడులు సర్వసాధారణంగానే జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువవుతున్నాయి. ఇలాంటి దాడులు సాధారణ వ్యక్తులపైనే కాదు, ఉన్నతోద్యోగాలు చేసే దళితులపై కూడా నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. దీంతో వారు పోలీసుల భద్రత మధ్య ఇలాంటి పనులు చేయాల్సి వస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దమోV్‌ా జిల్లాల్లో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. నీరజ్ అహిర్వార్ ఒక దళిత వ్యక్తి తన పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కడానికి పోలీసుల భద్రత కావాల్సి వచ్చింది. పెళ్లిలో గుర్రం ఎక్కవద్దని సదరు గ్రామంలోని ఆధిపత్య కులాల వారు దళిత యువకుడిని బెదిరించారట. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించి పెళ్లి పనులు చేసుకోవాల్సి వచ్చింది.దామోV్‌ా సూపరిండెంట్ డీఆర్ తెనివార్ మాట్లాడుతూ నీరజ్ అనే వ్యక్తి అభ్యర్ధన మేరకు ఒక టీంను సగోరయ గ్రామానికి పంపించాము. నీరజ్ పెండ్లి తంతు ముగిసే వరకు మా పోలీసులు రక్షణ కల్పించారు. దీనికి ముందు అహిర్వార్ ఒక వీడియో సందేశం ద్వారా తనను లోధి కులానికి చెందిన కొంతమంది నీరజ్ ను గుర్రం ఎక్కవద్దని బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కావాలని కోరాడు. ఇక నీరజ్ కు మద్దతుగా మధ్యప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ సభ్యుడు ప్రదీప్ అహిర్వార్ సగోరయ గ్రామానికి వచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా తాను ఇక్కడికి వచ్చినట్టు ప్రదీప్ తెలిపారు.