Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.212.05 కోట్లు పొందిన కాషాయ పార్టీ
న్యూఢిల్లీ : బీజేపీకి కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాల వర్షం కురింది. ఏడు ఎలక్ట్రోరల్ ట్రస్టులకు మొత్తంగా రూ. 258.49 కోట్ల కార్పొరేట్, వ్యక్తిగత విరాళాలు రాగా, ఇందులో 82 శాతానికి పైగా కాషాయ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. పోల్ రైట్స్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ వివరాలు వెల్లడించింది. మరో 10 పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ, ఎఐఏడీఎంకే, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎల్జేపీ, సీపీఐ(ఎం), సీపీఐ, లోక్‌తంత్రిక్ జనతాదళ్ పార్టీలకు మొత్తంగా రూ.19.38 కోట్ల విరాళం వచ్చింది. ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి రాజకీయ పార్టీలు విరాళాలను క్రమబద్ధంగా స్వీకరించడానికి ఏర్పాటు చేసిన లాభాపేక్షలేని సంస్థ. ఎన్నికల సంబంధిత ఖర్చుల్లో నిధుల వినియోగంలో పారదర్శకతను మెరుగుపరచడం ఈ ట్రస్ట్‌ల లక్ష్యం. ఏడీఆర్ నివేదిక ప్రకారం 23 ఎలక్టోరల్ ట్రస్టుల్లో 16 ట్రస్టులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత ఎన్నికల కమిషన్‌కు తమ విరాళాల వివరాలను సమర్పించాయి. వీటిల్లో ఏడు మాత్రమే విరాళాలు స్వీకరించాయి. ఏడు ఎలక్టోరల్ ట్రస్టులు కార్పొరేట్లు, వ్యకుల నుంచి రూ. 258.4915 కోట్ల విరాళాలను అందుకున్నాయి. ఈ మొత్తంలో రూ. 258.4301 కోట్లు (99.98శాతం)ను వివిధ పార్టీలకు పంపిణీ చేశాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇందులో 82.05 శాతం లేదా రూ 212.05 కోట్లను బీజేపీ అందుకోగా, జేడీయూ 10.45 శాతం లేదా రూ. 27 కోట్లను పొందింది. మరో 10 పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ, ఎఐఏడీఎంకె, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎల్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, లోక్‌తంత్రిక్ జనతాదళ్ పార్టీలకు మొత్తంగా రూ.19.38 కోట్ల విరాళం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాల్లో 95 శాతాన్ని అర్హతగల రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్టు పంపిణీ చేయాలి. రిజస్టర్ అయిన 23 ఎలక్టోరల్ ట్రస్టుల్లో 14 ట్రస్టులు తమ విరాళాల కాపీలను ఎలక్షన కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నాయి. మిగిలిన 8 ట్రస్టులు తమ విరాళాల నివేదికలను వెల్లడించలేదు. 2020-21లో 159 మంది వ్యక్తులు విరాళాలు అందచేశారు. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టుకు ఇద్దరు వ్యక్తులు రూ. 3.50 కోట్ల విరాళం ఇచ్చారు. స్మాల్ డోనేషన్స్ ఎలక్టోరల్ ట్రస్టుకు 153 మంది రూ. 3.202 కోట్లు, ఎఐజిగర్టిగ్ ఎలక్టోరల్ ట్రస్టుకు ముగ్గురు వ్యక్తులు రూ. 5 లక్షల విరాళం ఇచ్చారు. ఇండిపెండెంట్ ఎలక్టోరల్ ట్రస్టుకు ఒక వ్యక్తి రూ. 1,100 విరాళం ఇచ్చారు.