Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డోసుకు..డోసుకు మధ్య విరామంతో 9రెట్లు యాంటిబాడీలు
- యుకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ పరిశోధకులు వెల్లడి
న్యూఢిల్లీ : కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసుకు..రెండో డోసుకు సుదీర్ఘమైన విరామంతో యాంటిబాడీలు 9రెట్లు పెరుగుతున్నాయని యుకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ పరిశోధకులు వెల్లడించారు. అలాగే కరోనా వైరస్ మొదటి సారి సోకిన వ్యక్తులు 8నెలలు తర్వాత మొదటి డోసు తీసుకోవటం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నా యని తెలిపారు. వైరస్ సోకటం, సమయంతో సంబంధం లేకుండా రెండో డోసు తీసుకున్నవారిలో యాంటీబాడీలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయని తెలిపారు. బ్రిటన్లో 6000 మంది ఆరోగ్య కార్యకర్తల నుంచి రక్తనమూనాలు సేకరించి పరిశోధకులు అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పీఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారిం దరిలోనూ యాంటీ బాడీలు ఏర్పడ్డాయి. వైరస్ సోకిన తర్వాత మొదటి డోస్ తీసుకున్నవారిలో 10రెట్లు యాంటీబాడీలు ఏర్పడ్డాయి. డోసుకు.. డోసుకు మధ్య విరామం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా యాంటీబాడీలు ఏర్పడుతున్నా యి. అత్యధికంగా 9రెట్లు యాంటీబాడీలు ఏర్పడ టం పరిశోధకులు అధ్యయనంలో బయటపడింది. డోసుకు..డోసుకు మధ్య విరామం పెంచాలని బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని అష్లే ఓట్టోర్ అనే పరిశోధకుడు చెప్పారు. అయితే తమ పరిశోధనా ఫలితాలు సరైనవేనా? కాదా? అన్నది తేల్చుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.