Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 3 నుంచి 6 వరకు నిర్వహణకు ఎస్ఎఫ్ఐ సీఈసీ నిర్ణయం
- ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఐదు జాతీయ ర్యాలీలు
- ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్ బిస్వాస్ వెల్లడి
న్యూఢిల్లీ: ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభ తెలంగాణలో జరగనుంది. ఈ మహాసభ 2022 నవంబర్ 3 నుంచి 6 వరకు జరగనుంది. రెండు రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్ బిస్వాస్ లు ఈ నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఐదు జాతీయ ర్యాలీలు నిర్వహించాలని కూడా కేంద్ర కార్యవర్గం నిర్ణయించిందని తెలిపారు. కన్యాకుమారి, అగర్తల, పాట్నా, దహను, శ్రీనగర్‌లోని ఐదు మూలల నుంచి ర్యాలీలు ప్రారంభమవుతాయని చెప్పారు. దేశంలో ఉన్నత విద్యను ధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఈ ర్యాలీలు బహిర్గతం చేస్తాయని అన్నారు. ఈ ర్యాలీలు ''సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ ఫ్యూచర్, సేవ్ ఇండియా'' అనే నినాదంతో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ర్యాలీలు దేశంలోని ఎన్ఈపీ, నీట్, సీయూసెట్, ఎఫ్ వైయూసీ వంటి ప్రభుత్వ విద్యను విచ్ఛిన్నం చేయడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడానికి, ప్రతిఘటించడానికి ప్రజలను చైతన్యవంతం చేస్తాయని తెలిపారు. దేశంలో మత ధ్రువీకరణ, రాజ్యాంగంపై మితవాద దాడుల వంటి కేంద్ర ప్రభుత్వ మెజారిటేరిజం విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనలో ఎస్ఎఫ్ఐ ముందంజలో ఉందని, రానున్న కాలంలో ఈ పోరాటాలకు దిశానిర్దేశం చేయడమే ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభ లక్ష్యమని తెలిపారు.