Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇనిషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) మే2న వచ్చే అవకాశాలున్నాయని సమా చారం. ప్రస్తుతం ఈ సంస్థలో ప్రభుత్వం 100 శాతం వాటాలు కలిగి ఉంది. ఇందులో 5 శాతం వాటాలను విక్రయించాలని యోచిస్తోంది. 5 శాతం వాటాలకు సమానమయ్యే 31.6 కోట్ల షేర్లను మార్కెట్ శక్తులకు అప్పగించాలని భావిస్తోంది. సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం మే 12 లోపు ఐపీఓకు వెళ్లడానికి వీలుంది. ఆ తర్వాత వెళ్లాల్సి వస్తే మళ్లీ ఎల్ఐసీకి సంబంధించిన త్రైమాసిక ఫలితాలు, వాల్యుయేషన్లతో తాజా పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు వచ్చాక ఆ వివరాలను సెబీకి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఐపీఓ ఆగస్టు, సెప్టెంబర్ వరకు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మే తొలి వారంలోనే ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం.