Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రోజుల్లో 30 మందికి...
మద్రాస్: కరోనా కేసులు తగ్గుతున్నాయని అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరోసారి పెరుగుతున్న కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్ విద్యార్థుల్లో మరో 18 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో గత 4 రోజుల్లో ఇక్కడ నమోదయిన కేసుల సంఖ్య 30 దాటింది. దీంతో క్యాంపస్‌లోని విద్యార్థులు, స్టాఫ్ అందరికీ జీసీసీ(ది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్) కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తోంది. కోవిడ్ నిర్ధారణ అయిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు. కొంతమందికి గొంతు నొప్పి, ఒక విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నారని వివరించారు. వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో కాలేజ్‌లో జరిగే అన్నీ సాంస్కతిక, అకడమిక్ ఈవెంట్లను వాయిదా వేస్తున్నట్టు ఐఐటీ మద్రాస్ అధికారులు వెల్లడించారు. రద్దీని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
మాస్క్ ధరించకపోతే..రూ.500 ఫైన్...
తమిళనాడులో మాస్క్ తప్పనిసరితమిళనాడులో మాస్క్ తప్పనిసరి నిబంధనను తిరిగి అమల్లోకి తీసుకొస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి ఈ నిబంధనను ఆచరణలో ప్రవేశపెట్టింది. ఈ నిబంధనను ఉల్లంఘించినవారు రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తమిళనాడు హెల్త్ సెక్రటరీ జే రాధాక్రిష్ణన్ శుక్రవారం ప్రకటించారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పుడు తప్పనిసరి మాస్క్ నిబంధనను విరమించుకున్నామని, మళ్లీ కేసులు పెరగుతున్న నేపథ్యంలో నిబంధనను పున:ప్రవేశపెట్టామని చెప్పారు.