Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ కమిటీ ముందుకు రాలేకపోయిన ప్రజావేగు సోఫీజాంగ్
న్యూఢిల్లీ : ఫేస్బుక్ ప్రజావేగు సోఫీజాంగ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకు హాజరుకావటంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సోఫీ జాంగ్ కమిటీ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చేందుకు అనుమతి మంజూరు లేదా తిరస్కరించటం..చేయలేదు. దాంతో ఆమె పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకు రాలేకపోయారు. సోషల్, ఆన్లైన్ న్యూస్ మీడియా ఫ్లాట్ఫారమ్ల దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై స్టాండింగ్ కమిటీ కమిటీ ఆరవ, చివరి సమావేశాన్ని బుధవారం నిర్వహించింది.కమిటీ చైర్ పర్సన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్... నవంబర్ 1, 2021న జాంగ్ వాంగ్మూలానికి సంబంధించి స్పీకర్ నుండి అనుమతి కోరినట్టు పేర్కొంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. కమిటీ సభ్యులు అదే సంవత్సరం నవంబర్ 30న థరూర్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా అంగీకరించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 20న పౌరుల హక్కులను కాపాడటం, సోషల్, ఆన్లైన్ న్యూస్ మీడియా ఫ్లాట్ఫారమ్ల దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై కమిటీ చివరి సమావేశాన్ని నిర్వహించింది. కాగా, జాంగ్ వాంగ్మూలానికి సంబంధించి స్పీకర్ నుండి ఎటువంటి సమాచారం రాలేదని థరూర్ ధ్రువీకరించారు.
ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఫేస్బుక్లో నకిలీ ఖాతాలను సృష్టించారనే సంచలన విషయాన్ని సోఫీజాంగ్ బయటపెట్టారు. జాంగ్ 2018-2020 వరకు ఫేస్బుక్లో డేటా సైంటిస్ట్‌గా విధులు నిర్వర్తించారు. నకిలీ ఖాతాలతో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసేందుకు ప్రభుత్వాలు, 25 దేశాధినేతలు వాటినెలా ఉపయోగించారో 2020లో బట్టబయలు చేశారు. కాగా, వీటి పట్ల ఫేస్బుక్ అలసత్వం వహించడంతో పాటు చర్యలు తీసుకోవడంలో ఎలా వైఫల్యం చెందిందో ఆమె బట్టబయలు చేశారు.