Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుకొచ్చిన బ్రిటన్
- భారత్తో సహకారం పెంపు పట్ల ఆసక్తి చూపిస్తున్న బోరిస్ జాన్సన్
న్యూఢిల్లీ : అత్యంత అధునాతన ఆయుధాలను భారత్కు అందచేసేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. ప్రస్తుతం భారత్, రష్యాతో ఆర్థిక, రక్షణ సంబంధాలను విస్తరించుకుంటున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకోవాలని బ్రిటన్ భావిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం రాష్ట్రపతి భవన్ ఆవరణలో విలేకర్లతో మాట్లాడారు. భారత్, బ్రిటన్ల మధ్య ఇప్పుడున్నంత పటిష్టంగా సంబంధాలు ఎన్నడూ లేవని వ్యాఖ్యానించారు. భారత్, రష్యాల మధ్య పెరుగుతున్న సన్నిహిత సహకారం గురించి తెలుసని, దీనిపై మోడీతో మాట్లాడతానని గురువారం అహ్మదాబాద్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీయాలని కోరుకుంటున్న నియంతృత్వ దేశాల నుండి ఈనాడు ప్రపంచ దేశాలు ముప్పులను ఎదుర్కొంటున్నాయని జాన్సన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ పర్యటనలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇక్కడి హైదరబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు రాజకీయ, వాణిజ్య తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సంయుక్తం మీడియా సమావేశంలో ప్రసంగించారు. భారత్కు రక్షణ ఉత్పత్తుల సేకరణకు ప్రభుత్వ యంత్రాంగ పాత్రను, పంపిణీలో అవరోధాలను తగ్గించేందుకు వీలుగా ఓపెన్ జనరల్ ఎక్స్ఫర్ట్ లైసెన్స్ (ఒజిఇఎల్)ను ఏర్పాటు చేశామని బోరిస్ తెలిపారు.