Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయకుండా వెనుదిరిగిన ఆ ఇద్దరు
బెంగళూరు : 12వ తరగతి విద్యార్థులకు శుక్రవారం నుంచి ప్రీ యూనివర్సిటీ (పీయూ) బోర్డు పరీక్షలు మొదలవ్వగా.. ఆ ఇద్దరు విద్యార్థులు మాత్రం పరీక్ష రాయకుండా వెనుదిగారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను ధరించడం నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన అలియా అస్సాడీ, రేషమ్ ఫరూఖ్ పరీక్షలు రాయలేదు. ఉడిపిలోని విద్యోదయ పీయూ కాలేజీ పరీక్షలకు వెళ్లిన ఆ విద్యార్థులు.. హిజాబ్ తీసివేసేందుకు నిరాకరించారు. హైకోర్టు తీర్పును అనుసరించి, పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు హిజాబ్ ధరించిన ఏ విద్యార్థి అయినా... దాన్ని తీసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయినప్పటికీ తాము హిజాబ్ తీసేదిలేదని స్పష్టం చేయడంతో ఇన్విజిలేటర్లు వారిని వెనక్కు పంపారు. హిజాబ్ ధరించే రాయాలని పట్టుబట్టినప్పటికీ.. అనుమతించలేదనీ, దీంతో 10.45 వరకు వేచి చూసి.. అనంతరం పరీక్షా కేంద్రం నుంచి వెనుదిరిగారని ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ మారుతి మాల్గే అన్నారు. కాగా, పీయూ-2 పరీక్షలకు విద్యార్థులు హిజాబ్ ధరించి వస్తే కేంద్రంలోకి అనుమతించేది లేదని కర్నాటక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ పరీక్షలు మే 18 వరకు జరగనున్నాయి.