Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది దేశంలోని ప్రభుత్వ విద్యావ్యవస్థను నాశనం చేయడానికే..!
- 'సీయూఈటీ' వ్యతిరేక నిరసనలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్
న్యూఢిల్లీ : దేశంలో మోడీ ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) బీజేపీ బుల్డోజర్ అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ అన్నారు. ఇది దేశంలోని పబ్లిక్ ఎడ్యుకేషన్‌ను నాశనం చేయడానికేనని ఆరోపించారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)పై ఇప్పటికే విద్యార్థులలో ఆగ్రహం పెరుగుతున్నది. సీయూఈటీకి వ్యతిరేకంగా, ఎంఫిల్ కోర్సు రద్దు, పీహెచ్డీ కోర్సుల్లో సీట్ల కోతలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు యూనివర్సీటీ ఆఫ్ ఢిల్లీలోని ఆర్ట్స్ ఫ్యాకల్టీ వద్ద సమావేశమై నిరసన తెలిపారు. ఇందులో బృందా కరత్ పాల్గొని వారినుద్దేశించి ప్రసంగించారు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ పార్లమెంటును సైతం లెక్కజేయకుండా ఇలాంటి ముఖ్యమైన ప్రజలపై రుద్దడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎంచుకున్నదని ఆమె ఆరోపించారు. సెంట్రలైజేషన్, కమర్షియలైజేషన్, కమ్యూనలైజేషన్పై బీజేపీకి ఇంకా దాహం ఉన్నదన్నారు. 'వారు (కేంద్రం) ప్రతిదీ సెంట్రలైజేషన్ చేయాలనుకుంటున్నారన్నది సుస్పష్టం.
ఒకే కరిక్యులమ్‌ను దేశవ్యాప్తంగా బోధించాలని వారు అనుకుంటున్నారు. కానీ, ఈ సెంట్రలైజేషన్ ప్రయివేటు, ఉన్నత వర్గాల విద్యకు అనుకూలంగా ఉన్నది. ప్రభుత్వ విద్యారంగంలోని ప్రతీ అంశమూ నిర్వీర్యమవుతున్నది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. యూజీసీ అకడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌ను ప్రతిపాదిస్తున్నది. అయితే, ఎవరు ప్రయోజనాలను పొందబోతున్నారు'' అని ఆమె ప్రశ్నించారు. '' ఇక మిగిలిపోయిన అత్యంత ప్రమాదకర అంశం మతతత్వం(కమ్యూనలైజేషన్). ఇక్కడ అధికార పార్టీకి అనుకూలంగా చరిత్రలను నిరంతరం వక్రీకరించారు. నును జహంగీర్‌పురిలో పర్యటించునప్పుడు 'ఢిల్లీ యూనివర్సీటీలో అడ్మిషన్ కోసం పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందా?' 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అడిగారు. నేను నిశ్చయంగా సమాధానం చెప్పాను. కోచింగ్ కోసం ప్రభుత్వం సహాయం చేస్తుందా? అని వారు అడిగారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులు నాలుగో ఏడాది కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. వారు తమ పిల్లలను ఎన్నటికీ ఉన్నత విద్యా సంస్థలకు పంపించారు. దీని వల్ల బాలికలు చాలా నష్టపోతారు. మహమ్మారి సమయంలో బాలికల విద్య తీవ్రంగా దెబ్బ తిన్న విషయం ప్రపంచమంతా చూసింది. మన ఎంపీలు ఈ విధానాన్ని పార్లమెంటులో చర్చిస్తారనుకున్నారు. కానీ, ఇది ఎన్నడూ పార్లమెంటులోకి తీసుకురాలేదు. దయచేసిన నా మాటలు గుర్గుపెట్టుకోండి. వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామిక ఉద్యమాలు చేయాలి. ఇవి నియంతల అహాన్ని నిర్వీర్యం చేశాయి'' అని బృంద కరత్ అన్నారు. నూతన విద్యావిధానం దేశాన్ని పురాతన భారతదేశ స్థానానికి తీసుకెళ్తుందని ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు.