Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదో తరగతి పాఠ్యపుస్తకం నుంచి తొలగించిన సీబీఎస్ఈ
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2022-23 కరిక్యులమ్లోని పదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం నుంచి ప్రఖ్యాత పాకిస్థానీ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రెండు కవిత సారాంశాలు తొలగించబడ్డాయి. ఒక ఆంగ్ల వార్త సంస్థ ఈ విషయాన్ని పేర్కొన్నది. ఒక దశాబ్దానికి పైగా, పద్యాలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పాఠ్యపుస్తకంలోని ''డెమోక్రటిక్ పాలిటిక్స్ 2'' అనే ''మతం, మతతత్వం, రాజకీయాలు- మతతత్వం, సెక్యులర్ స్టేట్'' విభాగంలో భాగంగా ఉన్నాయని వివరించింది. ''పేజీ 46,48,49 లోని చిత్రం(లు) మినహాయించి'' పాఠ్యపుస్తకంలోని భాగంగా ఈ విభాగం కొనసాగుతుందని సీబీఎస్ఈ నివేదించింది.
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ప్రకారం, ఫైజ్ సాహిత్యంలో నోబెల్ బహుమతికి నామినీ అయ్యాడు. 1963లో లెనిన్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి ఆసియా కవి. విభజనకు ముందు పంజాబ్‌లోని సియాల్కోట్లో ఫిబ్రవరి 13, 1911లో ఫైజ్ జన్మించారు. కాగా, సీబీఎస్ఈ చర్యను ఫిల్మ్‌మేకర్ నందితాదాస్‌తో పాటు పలువురు హైలెట్ చేశారు.