Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిలయన్స్ ఇండిస్టీస్ వెల్లడి
ముంబయి : ప్యూచర్ గ్రూపునతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని రిలయన్స్ ఇండిస్టీస్ శనివారం కీలక ప్రకటన చేసింది. దీంతో 2020లో బియానీతో కుదిరిన రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందం అర్ధంతరంగా ముగిసినట్టయ్యింది. ఫ్యూచర్ గ్రూపునకు చెందిన సెక్యూర్డ్ రుణదాతలు తమ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రిలయన్స్ సంస్థ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్యూచర్ గ్రూపు వాటాదారులు, రుణదాతలు తమ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొంది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు ఆచరణ సాధ్యంకాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని రిలయన్స్ వెల్లడించింది.