Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 16న ఢిల్లీలో జాతీయ సదస్సు
- వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై యుద్ధం ప్రకటించిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మండిపడ్డారు. గ్రామీణ పేదల అందరినీ ఏకం చేసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్నా వ్యవసాయ కార్మిక సంఘాలన్నిటిని ఒక తాటి మీదకు తెచ్చేందుకు మే 16న ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని దీనికి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ పి.సాయినాథ్ ప్రధాన వక్తగా హాజరవుతారని ఆయన తెలిపారు. శనివారం త్రిపుర రాజధాని అగర్తలాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి .విస్తృత సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ పేదలను ఉపాధి నుంచి, సాగు భూములను నుండి దూరం చేసే విధానాలను బీజేపీ అనుసరిస్తోందని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీనపరిచి పేదలకు ఆహారాన్ని అందకుండా చేసిందన్నారు. ప్రపంచ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచిక)లో భారత్ అగ్రస్థానానికి చేరిందని ఆయన విమర్శించారు. భూ కార్పొరేషన్ పేరుతో పేదల వద్ద ఉన్న భూములను బలవంతంగా గుంజుకుని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని విమర్శించారు. ప్రజా పోరాటాలు లేకుండా ఎటువంటి హక్కులు, చట్టాలు, సంక్షేమ పథకాలు లభించలేదన్నారు. లౌకిక విలువలను, ప్రజాతంత్ర భావాలను, మతసామరస్యాన్ని సర్వ నాశనం చేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని రాయబారాలు, అర్జీలు, సాధారణ నిరసనలతో ఎదుర్కోలేమని, పేదల అందరూ ఏకమై దుష్ట విధానాలను ప్రతిఘటించేందుకు సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్రిపుర మాజీ ఆర్థిక మంత్రి భానులాల్ సహా మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా రాష్ట్రంలో గిరిజన, గిరిజనేతర ప్రజల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పి ప్రజారంజక పాలన వామపక్ష ప్రభుత్వం అందించిందని ఆయన తెలిపారు.