Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్షిక నివేదిక వెల్లడి
- రూ.790 కోట్ల నికరలాభం
- నష్టాలంటూ కేంద్రం చేస్తున్న ప్రచారం అబద్దమని రుజువు
న్యూఢిల్లీ : విశాఖ ఉక్కుకు లాభాల పంటపండింది. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వ అబద్దపు ప్రచారాలను మరోసారి పటాపంచలు చేసింది. తాజాగా 2021-22 వార్షిక నివేదికను కేంద్ర ఉక్కు శాఖ విడుదల చేసింది. గత ఏడాది ఏప్రిల్- డిసెంబర్ మధ్యకాలంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎన్పీఎల్)కు పన్నుకు ముందు రూ.946 కోట్లు, పన్ను తర్వాత రూ.790 కోట్లకు పైగా నికరలాభం వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ముడి ఉక్కు ఉత్పత్తిలో 47శాతం, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తిలో 75శాతం వృద్ధి సాధించింది. 10 లక్షల టన్నుల ఉక్కును ఎగుమతి చేసి రూ.4,572 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది కంటే ఇది 45శాతం అధికం. విశాఖ స్టీల్ 2021-22లో డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు రూ.2,170 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.331 కోట్ల ఆదాయాన్ని చేకూర్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.595 కోట్ల మూలధన వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 2022 జనవరి 31 నాటికి రూ.575 కోట్లు ఖర్చు పెట్టింది.