Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రమంగా పెరుగుతున్న కేసులు, మరణాలు
- ఢిల్లీలో పరిస్థితి తీవ్రం.. 27నసీఎంలతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో రోజుకు 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ సమచారం ప్రకారం ఆదివారం ఉదయానికి గత 24 గంటల్లో 2,593 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు సంఖ్యల 4,30,57,545కు చేరుకుంది. శనివారం కరోనాతో 44 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,22,193కు చేరుకుంది. క్రీయాశీల కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 794 క్రీయాశీల కేసులు పెరగడంతో ఆదివారం ఉదాయానికి దేశంలో మొత్తం 15,873 క్రీయాశీల కేసులు ఉన్నాయి. శనివారం కరోనా నుంచి 1755 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల శాతం 98.75 శాతంగా ఉంది. ఢిల్లీలో మరోసారి వెయికి పైగా కేసులు నమోదయ్యాయి. శనివారం ఇక్కడ 1,094 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 10 తరువాత ఇదే అత్యధికం. శనివారం ఢిల్లీలో కరోనాతో ఇద్దరు మరణిం చారు. శనివారం 22,614 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చారు. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి పెరిగింది. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో 213 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి కేసులు పెరుగుతుండటంతో పాఠశాలల్లో నూతన కరో నా మార్గదర్శకాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిం ది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అలాగే చేతులు శుభ్రం చేసుకోవడం, లేదా శానిటైజ్ చేసిన తరువాతే పాఠశాలల్లోకి అనుమతిస్తారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 27న సీఎంలతో ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఆదివారం మన్కీబాత్లోనూ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.