Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2018లో జమ్మూకాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ, బీజేపీ ల సంకీర్ణ కూటమి విచ్ఛిన్నమైన తర్వాత నుంచి అక్కడ కేంద్ర పాలన కొనసాగుతున్నది. అప్పటి నుంచి జమ్మూకాశ్మీర్లో రాజకీయ శూన్యత ఏర్పడింది. అయితే, జమ్మూకాశ్మీర్లో త్వరలో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హౌం మంత్రి అమిత్షా తో పాటు ఇతర కేంద్ర మంత్రులు ఇటీవల వెల్లడించిన విషయం విదితమే. ఇటు కేంద్రం కూడా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ స్థానాలను 83 నుంచి 90కి పెంచడానికి సిద్ధంగా ఉన్నదని తెలుస్తున్నది. ఎన్నికల సంఘం, కేంద్రం ఇప్పటి వరకు అక్కడ ఎన్నికల తేదీలకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే, జమ్మూకాశ్మీర్లో రాజకీయ అనిశ్చితి ఉన్నదనీ, మోడీ పర్యటనను రాజకీయ కోణంలో చూడటాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు వివరించారు. మోడీ పర్యటనపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు స్పందించడానికి నిరాకరించారు. గత మూడేండ్లకు పైగా జమ్మూకాశ్మీర్ ప్రజల '' చట్టబద్ధమైన రాజ్యాంగ హక్కులు'' ''నిబంధనలు, భూ చట్టాల'' ద్వారా లాక్కోబడ్డాయని సీపీఐ(ఎం) అగ్రనాయకులు మహ్మద్ యూసఫ్ తరిగామి అన్నారు. మా భూములు, పౌర హక్కులకు రక్షణ కావాలని తెలిపారు.