Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కటక్ : మద్యానికి బానిసయిన కుమారుడు రూ.100 ఇవ్వలేదని కన్నతల్లినే చంపేశాడు. ఈ ఘటన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా జాసిపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. హటపడియా గ్రామానికి చెందిన శాలందీ నాయక్ (55) కుమారుడు సరోజ్ గత శుక్రవారం రాత్రి సారా తాగి ఆ మత్తులో ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యాన్ని తాగడానికి తల్లిని రూ.100 అడిగాడు. ఇప్పటికే బాగా తాగావు మళ్లీ డబ్బెందుకని తల్లి ప్రశ్నించడంతో కోపోద్రేకుడయిన సరోజ్ కర్రతో ఆమెను కొట్టాడు.