Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసాయనాల నుంచి మాతృభూమికి విముక్తి కల్పించాలి : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : దేశంలో గొప్ప పంచాయితీరాజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ జమ్మూకాశ్మీర్ మాత్రం ఆ ఫలాలను అందుకోలేక పోయిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం జమ్మూలో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించిన మోడీ...దేశంలోనే తొలి కర్బన రహిత పంచాయితీగా ఈ గ్రామం చరిత్ర సృష్టించిందన్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్లో పర్యటించిన ప్రధాని..రూ.20వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం ఈ విధంగా మాట్లాడారు..
''గత రెండు, మూడేండ్లలోనే జమ్మూకాశ్మీర్ ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. గత ప్రభుత్వాలు ఇక్కడ కేంద్ర పథకాలను అమలు చేయలేకపోయాయి. కానీ మేము దాన్ని సాధ్యం చేశాం. గడిచిన ఆరు దశాబ్దాల్లో ఈ ప్రాంతంలో రూ.17వేల కోట్లు ఖర్చు పెట్టగా..కేవలం రెండేండ్లలో మేము రూ.38వేల కోట్లను ఖర్చు చేశాం. ఎన్నో ఏండ్లుగా రిజర్వేషన్లకు దూరమైన జమ్మూ ప్రజలు ఇప్పుడు వాటికి అర్హులు. మునపటి తరాలు చూసిన సమస్యలు నేటి జమ్ము యువత ఎదుర్కోదు'' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బనిహాల్-కాజీగుండ్ సొరంగ రహదారిని జాతికి అంకితం చేశారు.
ఇక దేశవ్యాప్తంగా పంచాయితీలను ఉద్దేశించి మాట్లాడిన మోడీ...సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయడంలో గ్రామ పంచాయితీలు కీలకంగా వ్యవహరించాలన్నారు. రసాయనాల వాడకాన్ని పూర్తిగా తగ్గించి మాతృభూమిని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన ప్రధాని..గ్రామపంచాయితీ స్థాయిలోనే దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.