Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సీజేఐ
న్యూఢిల్లీ : 2019లో జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను వేసవి సెలవుల తర్వాత విచారణకు అంగీరిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఆ ఏడాది ఆగస్టులో జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ను ఏకపక్షంగా రద్దు చేసిన కేంద్రం, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. రాష్ట్రంలో జరుగుతున్న పునర్విభజన కసరత్తు దృష్ట్యా ఈ పిటిషన్‌పై తక్షణ విచారణ అవసరమని పిటిషనర్లలో ఒకరి తరుపు సీనియర్ న్యాయవాది శేఖర్ నఫాడే చేసిన వాదనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. కాగా, ఇది ఆర్టికల్ 370కి సంబంధించిన విషయమని, పునర్విభజన జరుగుతోందని కోర్టు తెలిపింది. వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై దృష్టి సారిస్తానని సీజేఐ తెలిపారు. ఈ విషయంపై ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం చూడాల్సి ఉంటుందనీ, దీని నిమిత్తం బెంచ్‌ను పునర్నిర్మించవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ.. దాఖలైన దాదాపు రెండు డజన్ల పిటిషన్లను అప్పటి సీజేఐ రంజన్ గొగొయ్ నుంచి ప్రస్తుత సీజేఐ ఎన్వి రమణ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి పంపారు. కాగా, అప్పటి ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ సంజరు కృషన్ కౌల్, ఆర్. సుభాష్ రెడ్డి ఉన్నారు. కాగా, వీరిలో సుభాష్ రెడ్డి 2022 పదవీ విరమణ చేయడంతో.. బెంచ్‌ను పునర్నిర్మించాల్సి ఉంటుందని సీజేఐ రమణ తెలిపారు.