Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో 3.5 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఇష్యూ మే 4న తెరవబడి 9న మూసి వేయనున్నారని సోమవారం కీలక రిపోర్టులు వచ్చాయి. ఎల్ఐసీ విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఇందులో 3.5 శాతం వాటాల అమ్మకంతో రూ.21,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ పత్రాలను బుధవారం సెబీకి సమర్పించనుంది. ఈ ఇష్యూలో 22.14 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఇంతక్రితం ఫిబ్రవరిలో 5 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచించింది. కానీ రష్యా, ఉక్రెయిన్ పరిణామాలకు తోడు ఒత్తిడిలో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ల నేపథ్యంలో తాజాగా వాటాల విక్రయ సైజ్ను కేంద్రం తగ్గించుకుందని తెలుస్తోంది.