Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30న ఢిల్లీలో సిఎం, సిజెల సమావేశంపై చర్చ
అమరావతి : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో సిఎం వైఎస్ జగన్మో హన్‌రెడ్డి సోమవారం విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. ఈనెల 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగనున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల భేటీ దృష్ట్యా సమావేశం అజెండాపై ఇరువురు చర్చించారు. 2016 ఏప్రిల్ 4 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సిజెల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, ప్రగతితోపాటు పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయసహాయంపై మార్గదర్శక ప్రణాళిక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఇ-కోర్టుల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. వీటికి సంబంధించి రాష్ట్రం నుంచి నివేదించాల్సిన అంశాలపై సిఎం, హైకోర్టు చీఫ్ జస్టిస్ చర్చించారు. ఈ సమావేశంలో హైకోర్టు ఉన్నత పరిపాలనాధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధానాధికారులు పాల్గొన్నారు.