Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంతీర్పుకు సీఐటీయూ అభినందనలు
- తీర్పును వెంటనే అమలుజేయాలి
- గుజరాత్లో సుదీర్ఘకాలంగా పోరాటం..కార్యకర్తలకు సెల్యూట్
న్యూఢిల్లీ : అంగన్వాడీలు కార్మికులే.. వారికి గ్రాట్యుటీ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఐటీయూ అభినందించింది. సుప్రీం తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలుజేయాలని కోరింది. గుజరాత్లో సుదర్ఘీకాలం పోరాడిన కార్యకర్తలను అభినందనలు తెలిపింది. పని ప్రదేశాల్లో మెరుగైన పరిస్థితులు కల్పించాలన్న సుప్రీంకోర్టు తాజా తీర్పును సీఐటీయూ స్వాగతించింది. వర్కర్స్ హోదా ఇవ్వాలని, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్.. మొదలైన ప్రయోజనాలు కల్పించాలని స్కీం వర్కర్ల హక్కులపై 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చేసిన పలు సూచనల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేయాలని సీఐటీయూ కోరింది. సుదీర్ఘకాలంగా అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంఘాలకు, సీఐటీయూ అనుబంధంగా పనిచేస్తున్న గుజరాత్ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంఘానికి, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్‌కు సీఐటీయూ అభినందనలు తెలియజేసింది. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. న్యాయపోరాటంలో పాలుపంచుకున్న ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.వి.సురేంద్రనాథ్, న్యాయవాది సుభాష్ చంద్రన్‌లను అభినందించింది.
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు 'వర్క్‌మెన్' హోదా కల్పిస్తూ, గ్రాట్యుటీ పొందటం వారి న్యాయపరమైన హక్కు అని సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. దీంట్లో న్యాయవాదులు పాత్ర మరువలేనిదని సీఐటీయూ ప్రశంచింది. గ్రాట్యుటీ, పని ప్రదేశాల్లో మెరుగైన పరిస్థితుల కోసం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంఘాలు, గుజరాత్లో సీఐటీయూ అనుబంధంగా పనిచేస్తున్న సంఘం, మరికొంత మంది గతకొన్నేండ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. వీరి పోరాటాన్ని గుజరాత్లో బీజేపీ సర్కార్ తీవ్రంగా అణచివేస్తూ వస్తోంది. ఈ అణిచివేతను ఎదుర్కొంటూ కార్యకర్తలు ఎన్నో ఏండ్లుగా పోరాటాన్ని సాగించారని, ఉద్యమాన్ని అణచివేసేందుకు 300మంది కార్యకర్తల్ని బీజేపీ సర్కార్ తొలగించిందని, అయినప్పటికీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి విజయం సాధించిన కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నామని సీఐటీయూ తెలిపింది. అంగన్వాడీ కార్యకర్తలు, వారి సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లో 1972 చట్టం ప్రకారం కంట్రోలింగ్ అథారిటీ వారు గ్రాట్యుటీకి అర్హులని పేర్కొంది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధ్రువీకరించింది. అయితే జిల్లా అభివృద్ధి అధికారి దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ తీర్పును పక్కన పెట్టింది. 1972 చట్టంలోని సెక్షన్ 2(ఈ) ప్రకారం అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లలను ఉద్యోగులుగా చెప్పలేమని, ఐసీడీఎస్ ప్రాజెక్టును సంస్థగా చెప్పలేమని డివిజన్ బెంచ్ పేర్కొంది.