Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్
న్యూఢిల్లీ : వచ్చే నెలలో ఇనీషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానున్న జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ షేర్ల ధరల శ్రేణీ రూ.902-రూ.945గా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్ అందించనున్నారు. రిటైల్, ఆ సంస్థ ఉద్యోగులకు రూ.40 డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఎల్ఐసీలో 3.5 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇష్యూ మే 4న తెరవబడి 9న మూసివేయనున్నారని ఇంతక్రితం విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. మే2న యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. ఎల్ఐసీ మిగులు విలువ (ఎంబాడెడ్ వ్యాల్యూ)ను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఇందులో 3.5 శాతం వాటాల విక్రయానికి గాను సెబీకి సమర్పించిన ప్రాథమిక రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ దస్త్రాల (డిఆర్‌హెచ్‌పి)కు ఏప్రిల్ 25న ఆమోదం లభించిందని తెలుస్తోంది. ఈ వాటాలను ఉపసంహరించుకోవడం ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని మోడీ సర్కార్ నిర్దేశించుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఓ విజయవంతానికి ఎల్ఐసీ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు భారత్‌లోని ముంబయి, న్యూఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, రాజ్‌కోట్, కోల్‌కతా సహా ఆరు నగరాల్లో రోడ్ షోలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.