Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 6 నుండి 12 ఏండ్ల వయస్సు గల చిన్నారులకు కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఏ) మంగళవారం అత్యవసర అనుమతిం చింది. 5 నుంచి 12 ఏండ్ల వారికి బయోలాజికల్ ఈ-సంస్థ తయారు చేసిన కార్బెవాక్స్ టీకాను పంపిణీచేసేందుకు కూడా డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 12 ఏండ్లస్త్ర దాటిన వారికి ఇస్తున్న కోవాగ్జిన్‌ను చిన్న పిల్లలకు సైతం ఇచ్చేందుకు అనుమతి కోరుతూ గతంలోనే భారత్ బయోటిక్ దరఖాస్తు చేసుకుంది. కార్బెవాక్స్ కోసం బయోలాజికల్ ఇ-సంస్థ కూడా అనుమతి చేసుకుంది. అలాగే 12 ఏండ్లు పైబడిన పిల్లలకు జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి ఇచ్చేందుకు కూడా డీజీసీఏ మంగళవారం అనుమతి ఇచ్చింది.